బ్రేకింగ్ : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మృతి.

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నరేంద్ర మోదీ తల్లి.. హీరాబెన్‌ మోదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా.. గత రెండు రోజులుగా అహ్మదాబాద్‌ యూఎన్‌ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరాబెన్‌ శుక్రవారం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తల్లి మృతి పట్ల.. మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలో ఆయన ట్విట్టర్‌ వేదికగా.. తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. తన మాతృమూర్తి.. నిండు నూరేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందంటూ.. మోదీ భావోద్వేగానికి గురయ్యారు మోదీ తన ట్వీట్‌లో..‘‘దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం.. వంటి మూడు త్రిమూర్తి లక్షణాలు మా అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె నాకు ఓ విషయం చెప్పింది.

తెలివిగా నడుచుకో.. స్వచ్ఛతతో జీవించు అన్నది. ఆ రోజు అమ్మ చెప్పిన విషయాన్ని నేను ఎన్నటికి మరవను’’ అంటూ మోదీ ట్విట్టర్‌లో ఎమోషనల్ అయ్యారు. ఇక హీరాబెన్ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉండే మోదీ.. తన పుట్టిన రోజు, తల్లి బర్త్‌డే, ప్రమాణ స్వీకారం వంటి ముఖ్య సందర్భాల్లో.. తప్పుకుండా ఆమెను కలుస్తారు. కాసేపు తల్లితో గడుపుతారు.