మీ జుట్టు ఎంత సన్నగా ఉన్న సరే.. ఈ రెమెడీ ట్రై చేసి చూడండి.

జుట్టు బాగా పొడుగుగా ఉండాలి అంటే ఏ షాంపూ వాడాలి, ఏ షాంపుతో ఏది కలిపితే హెయిర్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది, ముఖ్యంగాజుట్టు ఊడటం తగ్గాలి అంటే ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ట్రై చేస్తుంటారు..ఇక మీరు రోజు వాడే ఏ షాంపు నైనా ఈ రెమెడీ కి ఉపయోగించవచ్చు. ఏ షాంపు వాడినా సరే మీరు ఈ టిప్స్ పాటించినట్లయితే, జుట్టు చాలా బాగా పెరుగుతుంది.

ఈ రెమెడీ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

1.మందార పువ్వులు

2.టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్

3.మీరు రోజు వాడే షాంపూ

4.కరివేపాకు

5.సరిపడా నీళ్ళు

రెమెడీ తయారీ విధానం:

మందార పువ్వులు మనందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి,మీకు మందార పువ్వులు అందుబాటులో లేకపోతే, మందార పౌడర్ ని వాడుకోవచ్చు. ఈ పౌడర్ మనకు మార్కెట్లో లభిస్తుంది. మందార పువ్వులే కాదు ఆకులు కూడా మనకు మేలు చేస్తాయి. మందార ఆకులు జుట్టుని ధృడంగా చేస్తాయి. రెమెడీ చేసే ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి. ఒక వేళ మీ జుట్టు పొడవుగా ఉంటే రెండు గ్లాసుల వాటర్ ను యాడ్ చేసుకోండి.

ఈ నీటిలో 2 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే కాఫీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవావాలి. ఆ నీటిలో నాలుగు మందార పువ్వులను వేసుకోవాలి. అదేవిధంగా ఆ నీటిలో ఒక ఐదు, ఆరు మందార ఆకులను కూడా వేసుకోవాలి. ఒక వేళ మీకు మందార ఆకులు అందుబాటులో లేకుంటే మీరు కరివేపాకు ఆకులు కూడా వాడుకోవచ్చు. ఆ నీరు డికాశన్ లాగా మారిన తరువాత గ్యాస్ ను కట్టేసుకోవాలి. అలా తయారు చేసుకున్న నీటిని మనము ఫ్రీడ్జ్ లో పెట్టుకొని 20 రోజుల వరకు నిలవ ఉంచుకోవచ్చు.

ఈ నీటిని మనం మనకు నచ్చిన షాంపులో కలిపి యూస్ చేసుకోవాలి, హెయిర్ కి షాంపూ ఎంత సరిపోతుందో అంతా షాంపు తీసుకుని ఇందులో మీరు ఒకటి కానీ రెండు షాంపులను కానీ వేసి మీ హెయిర్ కి సరిపడా షాంపూ ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ రెమిడీని తల స్నానం చేసేటప్పుడు ఉపయోగించి హెయిర్ వాష్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రెమెడీ తరువాత మీ జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది హెయిర్ లో మనకు తెలియకుండానే షైనీనెస్ యాడ్ అవుతుంది.