రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివంటే …

సంపూర్ణ ఆహారమని చెప్పుకునే పాలలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. దాదాపు అన్ని రకాల న్యూట్రియంట్లు లభిస్తాయి. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం పాలు బాగా తాగమని సూచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పచ్చిపాలు తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది మరిగించిన పాలు తాగుతూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి అనే ప్రశ్నలు చాలామందికి తలెత్తుతూ ఉంటాయి. మరి ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే, పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.

అమెరికా ఆరోగ్య శాఖకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అందించిన వివరాల ప్రకారం, పచ్చిపాలలో హాని కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది, ఈ కోహ్లీ లిస్తెరియా సాల్బోనేరియా అనేటువంటి బ్యాక్టీరియాలో పచ్చిపాలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే పచ్చిపాలు తాగడం వల్ల ఒక్కొక్కసారిఫుడ్ పాయిసన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట. పచ్చిపాలు తాగడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి కీడు కలిగిస్తుంది, ఫలితంగా డయేరియా డిహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఆసిడ్ల స్థాయిలు కూడా పెరుగుతాయి, పాలు తీసుకునేటప్పుడు ఆ జంతువుల పొదుగు కలుషితమై ఉంటుంది అంతేకాకుండా పాలు తీసే వ్యక్తుల చేతులు లేదా, పరేసరాలు లేదా గిన్నె కూడా కలుశితమై ఉండవచ్చు.

ఈ పాలు నేరుగా పచ్చిగా తాగితే ఆ కాలుషితం అంతా మీ శరీరంలో చేరుతుంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అందుకే పాలను బాగా ఉడికించి చల్లారిన తాగడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. ఇక వర్షాకాలంలో శీతాకాలంలో రాత్రిపూట వేడివేడి పాలు తాగి తే చర్మం వేడిగా ఉంటుంది. అంతేకాదు నిద్ర కూడా ఈజీగా పడుతుంది. వేడి పాలలో కూడా క్యాల్షియం విటమిన్ డి పొటాషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేడిపాలు ఏ సమయంలో తాగిన ఈజీగా జీర్ణం అవుతాయి.