ఏడుస్తూ దేవుడిని తలుచుకుంటే…

భారతీయ సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతునితోనే ముడిపడి ఉంటుంది. షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, చంద్రుడికి 16 కళలు ఉంటాయి. మనిషికి 16 సంస్కారాల చేత సంస్కరించబడతాడు. తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుండి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకువెళ్లి ఇష్టం వచ్చినట్టు పడేయడానికి వీల్లేదు, మన సంస్కారం ప్రకారం సంస్కారం చేసే దీన్ని విధిగా పంచభూతాలలోకి పంపించేస్తారు.అందుకని మనిషి కూడా 16 కళలు, 16 సంస్కారాలు, వాటితోనే మనకు కాలగతిని చెప్పుతూ శుక్లపక్షం తిధులు చెబుతూ మనం కాలాన్ని గణన చేస్తూ ఈశ్వర ఆరాధన చేస్తాము, అలాగే భగవంతునికి పూజ చేసిన కూడా 16 ఉపచారాలతో పూజ చేయాలి, ఈ 16 ఉపచారములతోటే పూజ చేయడం అనేది దాని వెనకాల మన మనసును తీసుకువెళ్లే భగవంతుడు దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు.

ఎందుకు ఆ 16 ఉపచారాలు పెట్టారు అంటే మొట్టమొదటిది అంకెకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో, 16 ఉపచారాలలో మొట్టమొదటిది ధ్యానం. ఇప్పుడు మీరు పూజా విధానం ప్రారంభించిన తర్వాత ఇదే వరుసలో నడుస్తుంది నడిచేటప్పుడు మీ మనసు దానిపై లగ్నం కావడానికి చూసుకోవాలి మొట్టమొదటిగా చేయవలసింది ధ్యానంతో ప్రారంభమవుతుంది అప్పటివరకు పూజకు ముందు ఉన్నదాన్ని పూర్వంగమంటారు అంటే మీరు పూజ చేయడానికి మీరు తెచ్చినటువంటి వస్తువులలో ఏదైనా అపవితత్రంగా ఉండవచ్చు.లేదా మీ యందు అపవిత్రత ఉండవచ్చు, ఎందుచేత అంటే పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ మలం ఉండడానికి వీల్లేదు మన నవ రంద్రాల నుంచి వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాలలో నుండి నిరంతరం మలం ఊరుతూ ఉంటుంది అందుకని నిద్ర పోయి లేచి లేచిన వెంటనే దేవాలయంలోకి వెళ్లడానికి అర్హత ఉండదు స్నానం చేసి వెళ్ళాలి .

ఈ కారణం చేత మీరు బాహ్యంగా చేసే స్నానం వల్ల మీకు పరిశుభ్రత ఏర్పడిందని, మీరు కచ్చితంగా చెప్పలేరు అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్నిo. శరీరానికి పరిశుద్ధత ఏర్పడుతుంది కానీ లోపల మనసుకి నీ మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.దానికి పరిశుద్ధత లేదు, ఎన్ని ముట్టుకోకూడని వస్తువులను ముట్టుకుంది అందునా పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాము మనసుకున్న పెద్ద దోషం ఎక్కడ అంటే అది అంతకుముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది అంతకుముందు జరిగింది రాత్రి, రాత్రివేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండవచ్చు, మనసు ఒకవేళ అటువైపు వెళ్ళినట్లయితే పూజలో అపచారం జరుగుతున్నట్లే అప్పుడు స్మరణ లోకి రాకూడని విషయాలు వస్తూ ఉంటాయి, లేదా అంతకుముందు జరిగిన విషయాలు ఏవైనా మనసుపై పడవచ్చు అందుచేత వీటి నుండి బయటపడి మనసుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆచమనం చేస్తారు.