వారంలో ఒక్కసారైనా యివి జత చేయండి,, ఇక మీ బాడీలో అంతులేని విటమిన్ డి 2…

ఎండ నుండి మన శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది, ఈ విటమిన్ డి ఎండ తగలక పోవడం వలన ఈరోజుల్లో వందకి 90% మందికి లోపం కనిపిస్తుంది. విటమిన్స్ కూడా ఆహారం నుండి వస్తాయి కదా, మరి విటమిన్ డి కూడా ఆహారం నుండి ఎందుకు రాదు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది.ఆహార పదార్థాలలో విటమిన్ డి ఉంటుంది కానీ, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, అది మన శరీరానికి చాలదు. అసలు ఏ ఆహారం లో, విటమిన్ డి అనేది ఎంత ఉంటుంది? దానివలన మనకు ఎంత మేలు జరుగుతుంది? ఈ విషయాల గురించి కొంత అవగాహన చేసుకుందాం!అంటే విటమిన్ డి అనేది ఆహారంలో నేరుగా విటమిన్ డి రూపంలో ఉండదు, శాకాహారంలో డీ 2 రూపంలో ఉంటుంది, వృక్ష సంబంధమైన వాటి అన్నిటిలో విటమిన్ డి అనేది డి 2 రూపంలో ఉంటుంది.

ఈ డి 2 మన శరీరం లోపలికి వెళ్ళాక విటమిన్ డి గా కన్వర్ట్ అవుతుంది, మరి విటమిన్ డి టు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏవి? అది మనకు ఎంత కావాలి? దాని ద్వారా విటమిన్-డి ఎలా తయారవుతుంది? ఈ లెక్కన ఆలోచిద్దాం!అందుకని విటమిన్ డి 2 బాగా పుష్కలంగా కలిగిన ఆహార పదార్థాలు నేచర్ లో కొన్ని ఉన్నాయి, ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం, వీటిని కొంతమంది తినడం వలన కొంతవరకు విటమిన్ డి ప్రొటెక్షన్ స్టార్ట్ అయ్యేఅవకాశం ఉంది.వాటి గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం, ఏవైనా సరే మనం వంద గ్రాములు తీసుకున్నప్పుడు అందులో ఉండే విటమిన్ డి 2 మైక్రో గ్రాముల్లో చెప్పుకుందాం, బేబీ కార్న్100 గ్రాములు తీసుకుంటే, 32 మైక్రో గ్రాముల ఢీ టు ఉంది, రాగులు 41 మైక్రో గ్రాములు, లేత మొక్కజొన్న లో 42 మైక్రో గ్రాములు, తోటకూర విత్తనాలు 54 మైక్రో గ్రాములు, వాల్ నట్స్ 46 మైక్రో గ్రాములు, తెల్ల నువ్వులు 63మైక్రో గ్రాములు, నల్ల నువ్వులు 68 మైక్రో గ్రాములు, సోయాబీన్స్ 70 మైక్రో గ్రాములు అన్నిటికంటే ఎక్కువగా వై స్టర్ మష్రూమ్స్ 109మైక్రో గ్రాములు, అంతే ఇంకా ఇతర వాటిలో చాలా తక్కువగా ఉంటుంది, వృక్ష సంబంధితమైన వాటిలో ఢి 2 గ ఎంత ఉంటుందో చూసాం.

ఈడి 2 మనం తీసుకుంటే, అది శరీరం లోపలికి వెళ్లి అది విటమిన్ డి గా లివర్లో మారుతుంది, ఈ కన్వర్షన్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఉదాహరణకి ఒక లీటర్ పాలని మీరు గోవా చేసుకోవాలి అనుకున్నారంటే, దాన్ని ఒక గంట రెండు గంటల పాటు మరిగిస్తే లీటరు పాలకు కేవలం కొద్దిగా మాత్రమే వస్తుంది, అంత ఎక్కువగా ఉంటే గాని ఇంత కొంచెం వస్తుంది, అలాగే విటమిన్ డి 2, 40 నుండి 50 మైక్రోగ్రాములు మనం తీసుకుంటే అది సుమారుగా 7 నుండి 10 మైక్రో గ్రాముల విటమిన్ డి గా మారుతుంది.మన బాడీకి విటమిన్ డి అనేది ఒక రోజుకు 7 మైక్రోగ్రాముల వరకు కావాలి, అందుకని యావరేజ్ గా సరిపోతుంది, కొంచెం కావాలి అన్నా 10 మైక్రోగ్రాముల వరకు విటమిన్ డి సరిపోతుంది, కాబట్టి 40 నుండి 50 మైక్రోగ్రాముల D-2 అందితే సరిపోతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఆహారాల్లో చాలా D-2 అనేది ఉంది, చాలా నేచురల్ గా మందు లేకుండా వచ్చేస్తుంది అనుకోవచ్చు, స్థానిక ఒక సైంటిఫిక్ గా తేలిన వాస్తవం ఏమిటంటే, శాకాహారంలో ఉన్న D-2 ని ప్రేగులో అంతగా గ్రహించుకోకపోవచ్చు.

మన ప్రేగుల్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులు గాని, మన ప్రేగుల్లో ఉండే ఎసిడిక్ ఫుడ్స్ కానీ D-2 నీ డ్యామేజ్ చేస్తాయి అట, లోపలికి వెళ్లకుండా కిందికి తోసేస్తాయట, అందుకే ప్రేగుల్లో విటమిన్ D-2 గ్రహించుకునే శక్తి అనేది బాగా తగ్గిపోయింది, అనేది ఇప్పుడున్న పరిశోధనల మాట.అందుకని మనం విటమిన్ D-2 ఉన్న ఆహారాలను తీసుకుందాం, ఎంత లోపలికి వెళ్లాలో అంత వెళుతుంది, ఎంత కన్వర్ట్ అవ్వాలో అంత అవుతుంది, అందుకని మన ప్రయత్నం అనేది మంచి ఆహారాలు మనం ఏదైతే లిస్ట్ చెప్పుకున్నాము, అలాంటి నిత్యం తీసుకోవాలి, వీటన్నింటిలో కూడా విటమిన్ డి అనేది లభిస్తుంది.ఇవన్నీ తింటూ కూడా మీరు చెక్ చేసుకోండి, ఇక ఎండ కూడా తగలటం లేదు, ఇటు కూడా ఈ ఆహారం ద్వారా రావట్లేదు అనుకున్నప్పుడు, వేరే సోర్స్ లేనప్పుడు కంపల్సరీ విటమిన్ డి టాబ్లెట్స్ ని డాక్టర్ అడ్వైస్ గా తీసుకుంటూ నెలకు ఒకటి చొప్పున తీసుకుంటే, మీ జీవిత కాలం పాటు ఎండ తగలకపోయినావిటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది , విటమిన్-డి లోపం లేకుండా ఉంటే ఎముకలు బలంగా అవుతాయి, రక్షణ వ్యవస్థ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది.