రోజుకు ఒక గుప్పెడు 20 రోజులు తింటే….

బాదంపప్పు అనేసరికి కొంతమందికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ఇది బాగా కాస్ట్లీ,దీనిని బాగా డబ్బులు ఉన్నవారే తింటారు సామాన్యులకు ఇది కుదరదు అనే ఆలోచన ఉంటుంది. ఈ రోజుల్లో పిజ్జా ,బర్గర్లు డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే తినడం లేదు అందరూ తింటున్నారు. అవి ఇష్టం కాబట్టి డబ్బులు ఇబ్బంది అయినా సరే సంపాదించి మరి ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నారు. కానీ వాటి వల్ల నష్టాలు వస్తాయి అదే డబ్బులను బాదంపప్పులకు ఖర్చుపెడితే అనేక లాభాలు వస్తాయి. ఇందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. 100 గ్రాముల బాదంపప్పులను తీసుకుంటే ఇందులో 609 క్యాలరీల శక్తి లభిస్తుంది.

ఈ శక్తి అనేది కోడి మాంసం తీసుకుంటే 109 మేక మాంసం తీసుకుంటే 118 కానీ బాదం పప్పులు తీసుకుంటే 609 క్యాలరీలు అంటే దాదాపు 6 రెట్లు ఎక్కువగా శక్తి లభిస్తుంది. కానీ చికెన్ మటన్లతో పోలిస్తే ఆరు రెట్లు బలం ఎక్కువ ఆరు రెట్లు రేటు మాత్రం ఎక్కువ ఏం కాదు, మటన్ రేట్ చూస్తే కనుక 800 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది, ఈ బాదం పప్పులు కూడా అదే రేట్లో దొరుకుతూ ఉంటాయి. మరి ఇలాంటి బాదంపప్పులో పోషకాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, కార్బోహైడ్రేట్స్ మాత్రం అతి తక్కువ ఉంటాయి ఇది కేవలం మూడు గ్రాముల వరకే ఉంటాయి. మనందరికీ కూడా కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువ వాడడం వల్లే సమస్యలు వస్తున్నాయి, బాదంపప్పులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ అనేది 13 గ్రాములు ఉంటుంది, ఇక ముఖ్యంగా ఫ్యాట్ విషయానికి వస్తే 58 నుండి 59 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది.

ఈ ఫ్యాట్ లో కూడా ఉపయోగపడే కొవ్వులు చాలా మంచిగా బాదంపప్పులో ఉంటాయి. అందుకని బాదంపప్పులో ఉండే ఫ్యాట్ అనేది గుండెకు చాలా మంచిది. ఇందులో మెయిన్ గా విటమిన్ ఈ 26 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, మన బాడీకి 15 మిల్లీ గ్రాములు విటమిన్ ఒక రోజుకి సరిపోతుంది, కానీ 100 గ్రాముల బాదంపప్పులో 26 మిల్లీగ్రామ్స్ విటమిన్ E ఉంటుంది. పోలిక్ యాసిడ్ 35 మైక్రోగ్రామ్స్ ఉంటుంది, మెగ్నీషియం విటమిన్ కె బాగా పుష్కలంగా ఉంటాయి, మెయిన్ గా చూసినట్లయితే అన్నిటికంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కూడా బాదంపప్పులో ఉన్న స్థూల మరియు సూక్ష్మ పోషక విలువలు. మరి ఏ ఆహారం తీసుకున్న కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది? మరి ఈ బాదంపప్పు అనేది ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకుంటే బాగుంటుంది?

అసలు ఈ రోజుల్లో ఎక్కువమంది చావుకి కారణమయ్యే జబ్బు గుండె జబ్బు, గుండెకు ఫ్రెండ్లీ బాదంపప్పు, ఇది గుడ్ కొలెస్ట్రాల్ ని బాగా పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, లివర్ మనకు కావాల్సిన హెల్దీ కొలెస్ట్రాల్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఈ బాదం పప్పులు చాలా బాగా తోడ్పడతాయి. అలాగే బాదం పప్పులు డయాబెటిస్ ఉన్నవారికి ది బెస్ట్, ఎందుకంటే డయాబెటిస్ వారికి ఎనిమి కార్బోహైడ్రేట్స్, మరి డయాబెటిక్ ఉన్నవారికి ఫ్రెండ్లీ అంటే ప్రోటీన్ మరియు ఫ్యాట్. కార్బోహైడ్రేట్స్ కేవలం 3g కాబట్టి బాదంపప్పులు ఎవరు తిన్నా కూడా అసలు షుగర్ పెరగదు, బలం పెరుగుతుంది, బరువు పెరుగుతారు ,కండ పెరుగుతుంది ,నిరసం రాదు. అందుకని డయాబెటిక్ పేషంట్స్ రెగ్యులర్గా బాదంపప్పులను బాగా తీసుకుంటే చాలా మంచిది.

కొంతమంది రెగ్యులర్గా సిగరెట్లు తాగుతూ ఉంటారు దీనివల్ల లంగ్స్ డామేజ్ అవుతూ ఉంటాయి, దీనివల్ల గాలి తిత్తులు పాడైపోయి స్లేష్మాలు ఎక్కువగా తయారవుతాయి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి ఒక పరిశోధనలో సిగరెట్లు త్రాగే వారికి నాలుగు వారాలపాటు రోజుకు ఒక 80 గ్రాములు బాదం పప్పులు పెట్టారు, వీరికి ఏమైందంటే 35% లంగ్స్ డామేజ్ ని కాస్త కంట్రోల్ చేసి సిగరెట్ల వల్ల లంగ్స్ లో ప్రొడ్యూస్ అయ్యే డ్యామేజ్ చేయడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని 35% వన్ మంత్ లోనే ఈ బాదం పప్పులు తగ్గిస్తున్నాయి అని నిరూపించినవారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషనల్ అండ్ ఫుడ్ సేఫ్టీ చైనా వారు ఈ పరిశోధన చేసి మరి సిగరెట్లు తాగేవారికి స్పెషల్ బెనిఫిట్ బాదంపప్పులు ఇస్తున్నాయని చెప్పడం జరిగింది.