Weight Loss : కేవలం 10రోజుల్లోనే బరువు తగ్గడం ఎలా…?

Weight Loss : బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా మంది చాలా చిట్కాలు చెబుతూనే ఉంటారు. అయితే ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ పని చేయండి.. ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలా వరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు..ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ.. మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసి సమర్థవంతంగా కనిపించే అనేక బరువు తగ్గించే చిట్కాలు కనుగొన్నారు. వాస్తవానికి శాస్త్రవేత్త ఆధారిత 21 బరువు తగ్గించే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

బరువు తగ్గడానికి సాధారణ చిట్కాలు..!

ఎక్కువ పీచు పదార్థాలను తినడం మంచిది. మీ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థం తీసుకోవడం వలన మీరు తక్కువ కేలరీలు తీసుకోవడానికి సహాయపడుతుంది. పీచు పదార్థాలు ఉన్న ఆహారం బరువు తగ్గడానికి సిఫార్సు చేయబడింది. అంతేకాకుండా రోజుకు 30 గ్రాములు పీచు పదార్థాలు తినాలి. కానీ చాలామంది తగినంత పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోరు. కొన్ని అధ్యాయాలు ప్రకారం పీచు పదార్థాలు దీర్ఘకాలికంగా మీ బరువు తగ్గించడానికి సహాయపడతాయని చూపిస్తున్నాయి. అయితే ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం..

పీచు పదార్థం ఆహారం రెండు రకాలుగా ఉంటుంది..

 1)నీటిలో కరిగేది: 2)నీటిలో కరగనిది:   నీటిలో కరిగే పీచు పదార్థం తమ ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సమయంలో పీచు పదార్థం నీటిని గ్రహించి జెల్ కింద మారుతుంది. ఇంకా కరగని పీచు పదార్థం పేగుల గుండా వెళుతున్నప్పుడు కరగని ఫైబర్ జీర్ణించుకోలేదు. రెండు రకాల ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది.మరియు ఎక్కువ సమయం పొట్ట నిండినట్లుగా అనుభూతి చెంది ఆకలి వేయకపోవడం పైగా పీచు పదార్థాలు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బరువు తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్లు చాలామంది ఆహారంలో ప్రధానమైనవని చక్కెర ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్ ఆహారం ఎందుకు అంటే ఎక్కువ మంది తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు ఇష్టపడతారు. కాకపోతే మన ఆధునిక ఆహారంలో చెత్త పదార్థాలలో చక్కెర ఒకటి అని చెప్పవచ్చు..