ఇంటి పెద్ద లో ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి.

ఆచార్య చాణిక్యుడు ఎంతో గొప్ప పండితుడు, మరియు తెలివైన వ్యక్తిత్వం కలవాడు, ఈయన రచయితగా సలహాదారుడిగా, ఎనలేని ఖ్యాతి గడించారు. చాణిక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. కుటుంబం పెద్ద ఏ విధంగా ఉండాలో అని, తన నీతి శాస్త్రంలో సమాచారం ఇచ్చారు చానిక్యుడు. ఒక కుటుంబం ఎదగాలన్న, నాశనమవ్వాలన్నా అది ఆ ఇంటి నాయకత్వం వహించే పెద్ద మీద ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఎప్పుడైతే ఇంటి యజమాని సక్రమమైన మార్గాన్ని చూపిస్తారో, ఆ కుటుంబం ఉన్నత స్థితికి వస్తుందని, లేకపోతే అంధకారం ఏర్పడి కుటుంబం నాశనమవుతుందని, చాణిక్య నీతిలో చెప్పబడింది.

ఇప్పుడు ఇంటి పెద్ద ఏ లక్షణాలతో ఉండడం ద్వారా ఆ కుటుంబం నాశనం కాకుండా ఉంటుందో, చాణక్య సూత్రాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమస్య ఆచార్య చాణిక్య నీతి ప్రకారం కుటుంబ పెద్ద కుటుంబ సమస్యలకు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వాళ్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. ఏ సమస్య వచ్చిన మీరు ఉన్నారనే భరోసా వాళ్లలో కలగాలి. ఎప్పుడైతే ఇంటి యజమాని సమస్యలను పట్టించుకోకుండా ఉంటాడో, ఆ కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.

మంచి సంబంధం ఆచార్య చాణిక్యుడి నీతి ప్రకారం, ఇంటి పెద్ద తన సోదరులు మరియు సోదరీమణులతో ఎప్పుడు మంచిగా ప్రేమానుబంధాలను కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా ఉంటారు, మీ కుటుంబం చెడు మార్గం వెతుక్కునే ప్రమాదం ఉంటుంది. మీ సోదరుడు లేదా సోదరి ఏదైనా తప్పు చేస్తే వెంటనే దండించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునే వారిలా వారధిలా నిలుస్తారు. ఆహారం ఇంటి యజమాని ఎప్పుడూ ఆహారాన్ని అనుమతించకూడదని చానిక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే పిల్లలు కూడా తమ పెద్దలు చేసే పని అనుసరిస్తారు.