ఒక ముక్క నోట్లో వేసుకోండి నిద్ర కేవలం సెకన్స్ లో….

నిద్ర అనేది మన శరీరానికి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం, అవసరం. ఎందుకంటే ఈ నిద్ర ద్వారానే మన శరీర అవయవాలు అన్ని చక్కగా రీఛార్జ్ చేయబడతాయి. ఆ నిద్రలోనే మన శరీర అవయవాలన్నీ కూడా రిపేర్ మరియు క్లీన్ చేసుకునే అవకాశం ఉందిఅసలు మనకి మన బలమంతా నిద్రయే. మనం ఎప్పుడైనా గమనించినట్లయితే మన ఇళ్లల్లో ఎప్పుడైనా రెండు రోజులు శుభకార్యాలు ఉంటే సరిగ్గా నిద్రపోకపోతే ఆ రెండు రోజుల తర్వాత మీరు చాలా వీక్ అయిపోతారు. ఒక పది రోజులు తిండి తినకపోయినా అంతా నీరసం రాదేమో కానీ ఒక్క రోజు రెండు రోజులు నిద్ర లేకపోతే అంత వీక్నెస్ వచ్చేస్తుంది అంటే నిద్ర అనేది అంత బలం. మన శరీర అవయవాలు అన్నిటికీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, మళ్లీ నెక్స్ట్ డే పనిచేసుకోవడానికి సామర్థ్యాన్ని అంతా కూడా సమకూరుస్తుంది ఈ నిద్ర .

అలాంటి నిద్ర అనేది ఏడు, ఎనిమిది గంటల పాటు ఘాడంగా పట్టి ఉండాలి. కానీ చాలామందికి నిద్ర పడుతుంది కానీ నాలుగు గంటలు ఐదు గంటల వరకే పడుతుంది. ఇలా పట్టిన నిద్ర కూడా గాఢంగా ఆలోచిస్తే రెండు గంటలు మూడు గంటల వరకే గాడ నిద్ర పడుతుంది. మిగతా నిద్ర అంతా మత్తు నిద్ర మొద్దు నిద్ర లాగా ఉంటుంది. ఆ గాడ నిద్రలో ఈ అవయవాలన్నీ కూడా పూర్తిగా రిలాక్స్ అవుతాయి. తిరిగి తమ శక్తిని మొత్తం పుంజుకుంటాయి మీకు ఎక్కడలేని శక్తిని ఉదయం వరకు ఇవ్వగలుగుతాయి. మీ అవయవాల యొక్క లైఫ్ని పెంచేది కూడా నిద్ర సహకరిస్తుంది. మీ ఏజ్ పెరగడానికి మీ అవయవాలు ముసలితనంలో కూడా యాక్టివ్ గా పని చేయడానికి వాటికి రెస్ట్ ముఖ్యమైన కారణం.

అందుకని రెస్ట్ ఇస్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు, అందుకని ఇలాంటి ప్రాపర్ నిద్ర అనేది 7 ,8 గంటల పాటు పట్టాలి అది కూడా గాఢంగా పట్టాలి. మరి ఇలా నిద్ర ఎక్కువ పట్టకపోవడానికి కారణం ఏమిటంటే మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. శారీరక వ్యాయామాలు లేకపోవడం, అలసట లేకుండా కూర్చొని వేళ్ళతో పనిచేయడం మెంటల్ స్ట్రైన్ ఎక్కువ అవ్వడం, కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ ,వ్యాపార ఒత్తిడిలను తట్టుకునే బ్యాలెన్స్ పాజిటివ్ థింకింగ్ ఇక్కడ లేకపోవడం వల్ల పడుకునేసరికి, ఈ అలజడి అంతా మనసులో గుర్తుకు రావడం, వీటి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్ర పట్టినప్పటికీ మళ్లీ మెలుకువ వస్తే నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.

వీటి నుండి బయటపడడానికి మత్తు మాత్రలు వేసుకోవడం, కొంతమంది ఆల్కహాల్ లాంటిది సేవించాలి అనుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నాచురల్ గా నిద్రని బాగా పెంచడానికి ఏదైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తే! సైంటిస్టులు ఒక ఫ్రూట్ నిద్ర బాగా పట్టేందుకు ఉపయోగపడుతుందని నిరూపించారు. ఆ ఫ్రూట్ ఏమిటంటే కివి ఫ్రూట్, ఈ ఫ్రూట్ కి నిద్రకి చాలా చాలా సంబంధం ఉంది అని నిరూపించారు. 2011 వ సంవత్సరంలో ఏషియా పసిఫిక్ జోమల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ చైనా వారు స్పెషల్గా ఈ కివి ఫ్రూట్ మీద పరిశోధనలు చేశారు. పడుకోవడానికి ఒక గంట గంటన్నర ముందు రెండు కివి ఫ్రూట్స్ ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే వాళ్ల నిద్రలో 35 శాతం గాడత పెరిగింది, అంటే గాడ నిద్ర మనకు రోజు పట్టే దానికంటే కూడా 35% పెరిగింది.