ఇది తీసుకుంటే చాలు మీ ఇమ్మ్యూనిటి రెట్టిపవుతుంది మీకు గొంతునొప్పి,ఇన్ఫెక్షన్స్ జన్మలో రావు….

చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య ఇమ్యూనిటీ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం! దాంతో పాటు ఒక గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ లాంటివి మన దరిచేరకుండా ఏం చేయాలో ఎలాంటి రెమిడీస్ పాటించాలి?అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన వీటి నుండి మనం బయట పడవచ్చు అనేది కూడా తెలుసుకోపోతున్నాము. ఇమ్యూనిటీ అనేది మనం ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దానికోసం దానికి సరిపడా ఆహార పదార్థాలను ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి,కారణం ఏమిటంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లో ఉన్న వైరస్ అనేది ఎటాక్ చేయడం ద్వారా మనం ఇమ్యూనిటీ కోల్పోవడం జరుగుతుంది. వైరస్ అనేది ఎటాక్ చేసినప్పుడు ఫస్ట్ మన గొంతు, ముక్కు, అదేవిధంగా గొంతు నాలాలు కూడాఎఫెక్ట్ అవుతాయి, తద్వారా మన డైజెస్టివ్ సిస్టం ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా మన మొత్తానికి రోగాల బారిన పడుతున్నాం.

అయితే వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఒక మంచి ఆయుర్వేదిక్ రెమిడీగురించి తెలుసుకుందాం!ఈ రెమిడీ చాలా వరకు కూడా చక్కగా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఇమ్యూనిటీ సిస్టం పెంచడంలోనూ ,గొంతు నొప్పి అంతేకాకుండా గొంతులో ఉండేటటువంటి నాలాలు ఇవన్నీ కూడా క్లియర్ గా ఇన్ఫెక్షన్స్ రాకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.మరి ఇంతకు ఆ రెమిడీ ఏమిటో , ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం! చాలామంది ప్రస్తుతం గొంతు నొప్పి అనే ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారు, మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండేటటువంటి వైరస్ మన ముక్కు లోనికి వెళ్లగానే ఫస్ట్ వాటి ప్రభావాన్ని గొంతు పైన ,అదేవిధంగా ముక్కు రంధ్రాల పైన చూపిస్తుంది.

దానివల్ల ముక్కులోకి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, అదేవిధంగా గొంతు లోపల ఉన్న నాలాలు దెబ్బతిని, గొంతు నొప్పి రావడం లాంటివి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణమైన సమస్య మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే సమస్య, ఒక్కోసారి మన ఒంట్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తగ్గడం వలన కూడా మీ గొంతు నొప్పి అనేది మనల్ని ఎటాక్ చేయడం జరుగుతుంది.కాకపోతే ఈ సమస్య అనేది అన్ని వయసుల వారిలో రావడం జరుగుతుంది, ఈ గొంతు నొప్పి సమస్య వలన ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో టాన్సిల్స్ వాపు వచ్చి ఆ గొంతు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా గొంతు నొప్పి వల్ల మాట బొంగురు పోవడం, గొంతు నొప్పిగా ఉండడం మాట్లాడలేకపోవడం ,అదేవిధంగా గుటక వేయడానికి ఇబ్బంది పడడం, అదే విధంగా ఆహారం తినడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడడం, ఇలాంటివి మనకు గొంతు నొప్పి సమస్యతో బాధపడే వారి దగ్గర కనిపిస్తాయి.

కొందరిలో అయితే ఈ గొంతు నొప్పి వల్ల దగ్గు ,జలుబు ,జ్వరం బారిన కూడా పడుతూ ఉంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేసేటప్పుడు మన ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకో పోయే ఆయుర్వేదిక్ రెమెడీస్ తీసుకుంటే చాలు. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి గొంతునొప్పి చాలా చక్కగా తగ్గిపోతుంది, మరియు ఈ రెమిడీ ఎప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం, దాంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు గొంతు నొప్పి రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం.దీని కోసం మనం మొదట తీసుకోవాల్సింది అతిమధురం, అతి మధురాన్ని గొంతు నొప్పి సమస్యలకు ఒక మంచి ఔషధంగా వాడుతారు, అతిమధురం అనేది మన యొక్క శరీరంలో వాత, పిత్తారోగాలను సమూలంగా నివారించడం జరుగుతుంది. అతిమధురం లో ముఖ్యంగా ఉపయోగించేది ఈ మొక్క యొక్క వేర్లు, ఇది చాలా చక్కగా తియ్యటి రుచిని కలిగి ఉంటాయి, అంతే కాకుండా ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలతో శక్తివంతమైనా మొక్కగా చెప్పబడుతుంది.

మనకు ఈ అతిమధురం యొక్క పొడి అనేది మన దగ్గర ఆయుర్వేదిక్ షాప్ లో కచ్చితంగా దొరుకుతుంది, లేనిపక్షంలో ఆన్లైన్ లో కూడా మీరు తెప్పించుకోవచ్చు, మీరు ఈ అతిమధురం యొక్క పొడిని ఉపయోగించి హెర్బల్ టీ ని తయారు చేసుకోవాలి. ఇక హెర్బల్ టీని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, ఈ అతి మధురం పౌడర్ని తెచ్చుకున్న తర్వాత, ఫస్ట్ మీరు ఒక పాత్రని స్టవ్ మీద పెట్టి, ఒక 200 మిల్లీ లీటర్ల వరకు నీటిని పోసి, ఈ వాటర్ ని మనం అతిమధురం పొడి తో నింపాలి, అంటే ఒక అర స్పూన్ అతిమధురం పొడిని ఇందులో వేసుకుంటే సరిపోతుంది.ఈ అతిమధురం పొడి లో యాంటీబయాటిక్స్ అనేది పుష్కలంగా మనకు దొరుకుతాయి, మన గొంతులో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ ను చాలా చక్కగా తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది, ఇక తర్వాత మన తీసుకోవాల్సింది అల్లం, ఒక ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీటిని నీళ్లలో యాడ్ చేసుకోవాలి. అల్లం గొంతు నొప్పిని తగ్గించి, గొంతులోని ఇన్ఫెక్షన్స్ వైరస్ లను నాశనం చేస్తుంది, ఇప్పుడు ఈ వాటర్ని మీరు 3 – 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి, అయితే త స్టవ్ మంట లో చాలా తక్కువలో పెట్టి, మరిగించుకోవాలి.

ఇప్పుడు మూడు నిమిషాలు అయిన తర్వాత మనం సైంధవ లవణం లేదా రాక్ సాల్ట్ అని కూడా అంటారు కదా, దానినైనా నా పావు టీ స్పూన్ కలుపుకోవాలి, మనం వంటల్లో వాడే సాల్ట్ అనే అసలు వాడకూడదు, ఇప్పుడు మరో నిమిషం పాటు వాటర్ మరిగించి కోండి. ఇప్పుడు వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత, వాటర్ ని గ్లాసులోకి వడకట్టుకోవాలి, ఇప్పుడు మన హెర్బల్ టీ రెడీ అయిపోయింది, ఇలా తయారుచేసుకున్న హెర్బల్ టీ ని ఏ టైంలో తీసుకోవాలి అంటే, ప్రతిరోజు మూడుసార్లు ఈ టీ ని తీసుకోవాలి, ఉదయాన్నే పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం , రాత్రి భోజనం తర్వాత మరొక సారి, తీసుకోవాలి.ఈ టీ ని తీసుకోవడం వలన మనకు దగ్గు ,గొంతు నొప్పి, గొంతులో ఉండేటటువంటి కఫం, అదే విధంగా ఊపిరితిత్తులలో పట్టేసినటువంటి కప శ్లేష్మాన్ని కూడా ఇది నివారిస్తుంది.