ఇలా చేస్తే ఈగలు బొద్దింకలు జన్మలో మీ ఇంటి దరిదాపుల్లోకి రావు..

వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ చిరాకు ఉంటాయి, ఇక ఎక్కడ చేసినా కూడా ఇంట్లో ఇవే కనిపిస్తూ ఉంటాయి. అలాగే తినే ఆహార పదార్థాలపై కూడా ఈగలు వాలి చిరాకు కలిగిస్తూ జబ్బులకు కూడా గురిచేస్తాయి. మరి ఈగలు ,దోమలు, బొద్దింకలను ఇంటి నుండి పారద్రోలాలి అంటే చిన్న చిన్న చిట్కాలను యూస్ చేసుకుంటూ తరిమేయొచ్చు. వీటి కోసం కెమికల్స్ అలాగే ఇతర రియాక్షన్ ఇచ్చే మందులు వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇవన్నీ వాడుతూ ఉంటే చిన్నపిల్లలకు హెల్త్ డామేజ్ అవుతూ ఉంటుంది, ఫీవర్ గొంతు నొప్పి సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ యూస్ చేసుకుని ఈ బొద్దింకలను ఈగల్ని చిటికెలో మాయం చేసుకోవచ్చు. మరి ఈ వర్షాకాలంలో బుద్ధింకలో ఈగలు ఇవన్నీ కూడా మన ఇంటి ఆవరణంలో నుండి బయటికి పారిపోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి చూడండి మీ ఇంటి దరిదాపుల్లో ఈగలు బొద్దింకలు అనేది ఉండవు.

బొద్దింకలు అనేవి స్టవ్ దగ్గర కిచెన్లో ఆహార పదార్థాలపై వాళ్లతో చాలా విసుగును కలిగిస్తాయి, మనం ఫుడ్ ఐటమ్స్ లో వాడే వెనిగర్ ని తీసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ లో వెనిగర్ వేసుకోవాలి, ఈ వాసన ఈగలకు ,బుద్దింకలకు అస్సలు నచ్చదు. తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి, తర్వాత ఎక్కడైతే బొద్దింకలు ఈగలు ఉన్నాయో ఆ ప్రదేశంలో స్ప్రే బాటిల్ సహాయంతో స్ప్రే చేసుకోవాలి దీంతో ఆ దరిదాపుల్లో ఎలాంటి ఈగలు, బొద్దింకలు ఉండవు. అలాగే ఈ వాటర్ ని మనం ఇల్లు తుడుచుకునే నీళ్లలో కలుపుకొని కూడా వాడుకోవచ్చు. మరొక చిట్కా ఏమిటి అంటే అగర్బత్తి, వీటిని పొడి చేసుకుని అలాగే కర్పూరాన్ని కూడా తీసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి, తర్వాత ఒక బౌల్ తీసుకుని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న అగర్బత్తి మరియు కర్పూరం పొడి వేసుకోవాలి. ఈ చిట్కా అనేది ఈగలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది, ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక స్పూన్ తో కలుపుకోవాలి, తర్వాత కొద్దిగా కాటన్ తీసుకుని వాటర్ లో ముంచి పక్కన పెట్టుకోవాలి, ఇలా కొన్ని కాటన్ బాల్స్ ని చేసుకుని నీటిలో ముంచి మన ఇంట్లో ఎక్కడైతే బొద్దింకలు ఈగలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలో పెట్టాలి.

సింక్ దగ్గర స్టవ్ దగ్గర అలాగే ఫుడ్ ఐటమ్స్ దగ్గర అరటిపళ్ళు ఫ్రూట్స్ స్వీట్ ఐటమ్స్ ఇలాంటివి వాటి దగ్గర ఈ కాటన్ బాల్స్ పెట్టడం వల్ల బొద్దింకలు ఈగలు ఇక ఆ ప్రాంతంలో తిరగవు, అలాగే మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సేఫ్ గా ఉంటాయి అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది. మరొక చిట్కా ఏమిటంటే హారతి కర్పూరం తీసుకుని, అలాగే కొన్ని మిరియాలను తీసుకోవాలి. ఈ రెండిటిని కూడా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి, ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ పౌడర్ ని అందులో వేసుకోవాలి, అలాగే కొద్దిగా వెనిగర్ వాటర్ ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా షేక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడైతే ఈగలు బొద్దింకలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలో స్ప్రే చేసుకోవాలి, ఇక ఆ ప్రదేశంలోకి బొద్దింకలు ఈగలు రావడానికి అసలు ఇష్టపడవు, దీంతో మనకు ఈగలు బొద్దింకల బాధ అనేది తప్పుతుంది.