కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా నిలిచిన సీనియర్ నటి జమున (86) శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. దాంతో ఒక్కసారిగా పరిశ్రమ మెుత్తం దిగ్బ్రాంతికి లోనైంది. తెలుగు తెరపై స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగింది జమున. తెలుగుతో సహా తమిళ చిత్రాల్లో నటించారు ఈ వెండితెర సత్యభామ. దాదాపు 180 చిత్రాల్లో నటించిన జమున ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు దూరంగా ఉన్న జమున.. వయోభారవల్ల శుక్రవారం హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇక అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు తరలించారు జమున పార్థివ దేహాన్ని.

అనంతరం సాయంత్ర 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. జమున కుమారుడు విదేశాల్లో నుంచి రావడానికి వీలుకాకపోవడంతో కుమార్తె స్రవంతి రావు అన్నీతానై అంత్యక్రియలు పూర్తి చేసింది. జమున.. వెండితెర సత్యభామగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన సినీ కెరీర్ లో దాదాపు 180 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిస్సమ్మ, ఇల్లరికం, లేతమనసులు, గుండమ్మ కథ లాంటి గొప్ప చిత్రాల్లో నటించినప్పటికీ జమునకు పేరు తెచ్చిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది శ్రీకృష్ణ తులాభారమే. ఈ చిత్రంలో సత్యభామగా నటించిన జమునకు ప్రశంసలు దక్కాయి.

ఇక సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత ఇంటికే పరిమితం అయ్యారు జమున.ఈ క్రమంలోనే వయోభారం మీద పడటంతో శుక్రవారం ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు జమున. ఆమెకు ఇద్దరు సంతానం కొడుకు వంశీ జులూరి, కుమార్తె స్రవంతి రావు. జమున పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం సాయంత్ర 5 గంటలకు జమున అంత్యక్రియలు మహాప్రస్థానంలో పూర్తి అయ్యాయి. కొడుకు వంశీ విదేశాల్లో ఉండటంతో.. అంత్యక్రియలకు హాజరుకాలేక పోయారు. దాంతో కుమార్తె స్రవంతి చేతుల మీదుగానే జరగాల్సిన చివరి కార్యాన్ని జరిపించారు. కన్నీటిని దిగమింగుకుని తల్లి చితికి నిప్పుపెట్టింది కూతురు స్రవంతి.