చెవి సమస్యలను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు…

చెవిలో సమస్యలు అరుదుగా కలిగినప్పటికీ, దీని వలన కలిగే సమస్యల వలన నిలకడ లేకుండా చేస్తాయి, చెవి సమస్యలు సాధారణంగా, వైరల్ మరియు బ్యాక్టీరియా ల వలన ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ కలుగుతాయి, ఇక్కడ తెలిపిన ఆయుర్వేద ఔషధాల్లో, త్వరగా వాటి ప్రభావాన్ని చూపి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం .నువ్వులనూనె రెండు చుక్కల గోరువెచ్చని నువ్వులనూనె లేదా, ఆవాల నూనె చెవిలో పోయండి.

ఆ తర్వాత చెవిని చేతివేళ్లతో మోసి నోటితో శ్వాసను పీల్చండి, ఆ తరువాత పీల్చిన గాలి ని అలాగే నోట్లో బంధించండి, ఫలితంగా బుగ్గలు పెద్దగా అవుతాయి, ఇలా ఒకటి నుండి మూడు నిమిషాల పాటు ఉంచండి, ఈ పద్ధతి అనుసరించడం వలన చెవికి వచ్చే సమస్యలను పూర్తిగా తగ్గించుకోవచ్చు.ముల్లంగి నూనె ఒక కప్పు తెల్లని ముల్లంగి రసం మరియు ఒక కప్పు నువ్వుల నూనెను కలిపి, తక్కువ మంట తో నూనె స్థాయిలు తగ్గేవరకు, లేదా ఆవిరి అయ్యే వరకు వేడి చేయండి, ఈ నూనెను చల్లబరిచి నిల్వ చేయండి, ఈ మిశ్రమాన్ని రోజూ ఒకటి లేదా రెండు చుక్కలు చెవిలో వేసుకోండి, దీని వలన అన్ని రకాల చెవి సమస్యలు, అనగా శూన్య శబ్దాల సమస్యలు చీము ఏర్పడడం,పురుగుల వలన కలిగే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

వేప ఆకులు రెండు చేతుల పిడికిలి మొత్తంలో, రెండు వేప ఆకులను నీటిలో వేసి మరిగించాలి, అది మరిగే సమయంలో పసుపు కలపాలి, ఈ మిశ్రమాన్ని చిన్న గుడ్డ ముక్క తో, చెవి గొంతు ముక్కు భాగాలలో తుడవడం వలన, చెవి నొప్పులు తగ్గిపోతాయి, మీకు కనుక చెవిలో సమస్య వస్తే ఇవి పాటిస్తూ, ఆ సమస్యల నుండి విముక్తి పొందండి….