జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి.

ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య జుట్టు రాలడం. వెంట్రుకలు చిట్లిపోవడం, జుట్టు సరిగా పెరగకపోవడం ,తెల్ల వెంట్రుకలు రావడం. జుట్టుకి ఎప్పుడు ఒకే రకమైన షాపులోనే వాడాలి. వివిధ రకాల షాంపూలు మార్చకూడదు .జుట్టుకు రోజు నూనెతో మసాజ్ చేయాలి. కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి .కుంకుడు కాయలతో తలస్నానం చేయడం వల్ల జుట్టు డ్రై అవుతుంది .కాబట్టి తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె బాగా పట్టించాలి .అప్పుడు జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది.

 జుట్టు రాలకుండా ఉండాలంటే ఆముదం ,కొబ్బరినూనె,ఆలివ్ ఆయిల్ మూడింటిని కలిపి జుట్టుకి వారానికి మూడుసార్లు బాగా మసాజ్ చేయాలి. జుట్టుకి రోజు నూనె మసాజ్ చేయడం చాలా మంచిది. జుట్టుపై ఎన్ని ప్రయోగాలు చేసిన మనం తినే ఆహారంలో జాగ్రత్త పడాలి .ప్రతిరోజు తీసుకుని ఆహారం లో మునగాకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి మునగాకు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అలాగే అవిస గింజలతో లడ్డూలు చేసుకొని తినడం చాలా మంచిది .

ఇంకా ఆపిల్, బీట్రూట్ ,క్యారెట్ ఈ మూడింటిని కలిపి జ్యూస్ చేసి వారానికి మూడుసార్లు తీసుకోవడం వల్ల వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఇది పిల్లలకి కచ్చితంగా అలవాటు చేయాలి. అలాగే మార్కెట్లో నల్ల జీలకర్ర ఆయిల్ దొరుకుతుంది .అది జుట్టుకి వారానికి ఒకసారి మసాజ్ చేయడం చాలా మంచిది . అలోవెరాని కూడా జుట్టుకు ప్యాక్ లాగా వేసుకోవచ్చు.ఏ ఆయిల్ తో మసాజ్ చేసిన పైన పైన కాకుండా కుదుళ్ల వరకు మసాజ్ చేయాలి. జుట్టుకి ఆయిల్ మసాజ్ అనేది ప్రతిరోజు అవసరం ఇలా చేయడం వల్ల మీ జుట్టు హెల్తీగా ఉంటుంది బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.