పులిపిర్లు శాశ్వతంగా రాలిపోవాలంటే….

ఈరోజు మనం పులిపిర్లు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం, కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వీటిని సూర్డి కాయలు అని అంటారు, ఇవి వేళ్లమీద , మెడ దగ్గర వస్తూ ఉంటాయి.పులిపిర్లు అనేవి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి, HPV వైరస్ అంటారు వీటిని, వైరస్ దాడి చేసినప్పుడు మన శరీరము ముఖ్యంగా అవి చర్మం మీద దాడి చేసినప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ వాటిని చంప లేకపోయినప్పుడు,ఆ వైరస్ ఒకచోట చేరి వాటి గ్రోత్ బాగా డెవలప్ అవుతుంది, ఈ వైరస్ ప్రాణ హాని కలిగించేది కాదు. ఇలా ఈ వైరస్ గ్రోత్ అనేది పులిపిరి లాగా పైకి వస్తుంది.

మరి అలాంటి పులిపిర్లు చూడడానికి బాగోవు,కొంతమందికి పులిపిర్లు వచ్చిన భాగంలో వైరస్లు లోపల ఉంటే నరం యొక్క డ్యామేజ్ చేస్తుంటాయి.కొంతమందికి పులిపుర్లు ఉన్నాకూడా అక్కడ నొప్పి అనేది ఉండదు, ఒకవేళ నొప్పి ఉంటే వాటి డ్యామేజ్ అనేది లోపలి వరకు వెళ్ళింది అని అర్థం, ఇది అంటువ్యాధి కాదు, ఇలాంటి పులిపిర్లు ప్రకృతి సిద్ధంగా తగ్గుతాయి అంటే తగ్గుతాయి అని చెప్పవచ్చు.పులిపిర్లు తగ్గడానికి చాలా మంది చాలా రకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు, చాలా రకాల ఆయుర్వేద ప్రయత్నాలు కూడా చేస్తారు, కానీ ఇది తగ్గి తిరిగి మళ్లీ వస్తూ ఉంటాయి, ఈ పులిపిర్లు శాశ్వతంగా పోవాలి అంటే రా ఫుడ్స్ ను తీసుకోవాలి, అంటే వండకుండా వచ్చి ఆహార పదార్థాలను తినాలి, కొంతమంది పులిపిర్లను అగర్బత్తీలు పెట్టి కాల్చడం, గుర్రపు వెంట్రుక పెట్టి కట్ చేస్తే తెగిపోతుందని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ మళ్ళీ తిరిగి వస్తుంది, అందువల్ల ఇలాంటి ప్రయత్నాలు చేయకండి.

ఎందుకంటే లోపలి వరకు వైరస్లు ఉంటాయి కాబట్టి మళ్లీ గ్రోత్ వచ్చేస్తుంది.ఇలా పచ్చి ఆహార పదార్థాలను తినలేని వారు, ఇలా నిగ్రహంతో ఉండడం చాలా కష్టం, మనం చేసే పనికి దీనికి కూడా కుదరదు, దీనికి కూడా ఇంట్లోవాళ్లు సహకరించాలి ,సమయం కుదరాలి, ఇలా చేయడం కష్టంగా భావించేవారు హోమియోపతి మందులను కరెక్ట్ గా, మంచి డోసు వాడితే వారం పది రోజులు, 20 రోజుల్లోనే పులిపుర్లు అనేవి రాలిపోవడం జరుగుతాయి, ఇలా ఇలా సింపుల్ పద్ధతిలో కూడా పులిపిర్లను తగ్గించవచ్చు, ఇలాంటి వారికి హోమియోపతి ని ట్రై చేసి, ఈ రకమైన పులిపుర్లు ఉన్నాకూడా డాక్టర్ల అడ్వైస్ తో తగ్గించుకోండి, అందుచేత మీ లక్షణాలను బట్టి వారు మందును ఇస్తారు వారిని సంప్రదించి మీ పులిపిర్ల సమస్యలను దూరం చేసుకోండి.