పైసా ఖర్చులేకుండా డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ కౌంట్ ని లక్ష ల్లో పెంచే అద్భుతమైన మొక్కలు .

ఈ మధ్య డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా తీవ్రంగా పడిపోతుంది. దీని వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య సహజంగా పెంచే కొన్ని ఆకులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం

నేలవేము :-

నేల వేము ఆకు శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో వేసి ఆర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం అరగ్లాసు సాయంత్రం అరగ్లాసు ఐదు రోజులపాటు తీసుకుంటే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెంచుకోవచ్చు

మెంతి ఆకులు:-

మెంతి ఆకులను.శుభ్రంగా కడిగి నీటిలో వేసి రెండు గంటల తర్వాత ఆ నీటిని తాగాలి. ఈ విధంగా తాగటం వలన రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది

తులసి ఆకులు :-

గుప్పెడు తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలిపి తీసుకుంటే వారం రోజుల్లో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది

వేపాకులు :-

వేపాకులు నీటిలో కలిపి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. దీన్నుంచి రసాన్ని తీసి రోజుకు 10 ml మూడు సార్లు చొప్పున తీసుకుంటే రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది

బొప్పాయి :-

బొప్పాయి ఆకు గురించి మనలో చాలా మందికి తెలుసు.బొప్పాయి ఆకు రసాన్ని డాక్టర్ సూచించిన ప్రకారం తీసుకుంటే రక్తంలో ప్లేటెట్స్ .సంఖ్య పెరుగుతుంది

తిప్పతీగ :-

తిప్పతీగ సర్వరోగనివారిణి అని మనకు తెలుసు. ఈ ఆకులు మూడు తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి ప్రతి రోజు తాగుతుంటే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది

ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక దానిని కనీసం నాలుగు రోజులపాటు తీసుకుంటే సహజంగా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది