మీ గార పట్టిన పళ్ళు తెల్లగా ముత్యాల్లా అవ్వాలంటే….

చాలామంది సంతోషంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనస్ఫూర్తిగా నవ్వలేరు, నోరు విప్పి అసలు నవ్వలేరు ఎందుకంటే వారి పళ్ళు పసుపు లేదా పచ్చ వర్ణంలో ఉంటాయి అందుకని కాస్త నామోషీగా ఫీల్ అవుతారు. అసలు పళ్ళు ప్రచారంలో ఎందుకు మారుతాయి అంటే దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మన దంతాలపై రక్షణ కవచంగా ఎనామిల్ అనే పొర ఉంటుంది కోటింగ్ లాగా ఉంటుంది. ఎనామిల్ దెబ్బ తినడం వల్ల లోపల డెంటిల్ అనే భాగం బయటపడుతుంది, ఎనామిల్ కోటింగ్ తగ్గే కొద్దీ లోపల పొర బయటపడుతుంది.

ఈ లోపలి బాగామనేది ఎల్లో ఇష్ గా ఉంటుంది , ఎనామిల్ అనే కోటింగ్ మాత్రం ఎల్లోఇష్ గా ఉంటుంది. ఈ ఎనామిల్ పోయేటట్లు చాలామంది చేస్తూ ఉంటారు, అసలు ఈ అనామిల్ ఎంత గట్టిగా ఉంటుందంటే 1100 డిగ్రీలు వేడి చేస్తే తప్ప ఎనామిల్ కరగదు. ఇలాంటి ఎనామిల్ పోవడానికి మనం చేసే పనులు పంచదారలు కూల్ డ్రింక్స్ ,ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కెమికల్స్ తో తయారు చేస్తారు ఆసిడ్స్ తో తయారు చేస్తారు కాబట్టి ఈ ఎసిడిక్ ఫుడ్ ఎనామిల్ ని పాడుచేస్తుంది. వీటితోపాటు కొంతమంది పొగాకు నమలడం సిగరెట్లు తాగడం వక్కపొడి నమలడం, టీ కాఫీలు ఎక్కువగా త్రాగడం వీటి వల్ల కూడా ఎనామిల్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఎనామిల్ తగ్గిందో లోపల ఉండే ఎల్లో అనేది బయటపడుతూ ఉంటుంది.

కానీ చాలామందికి ఎనామిల్ దెబ్బ తినకపోతే పళ్ళు తెల్లగా ఉంటాయని తెలియదు, కానీ అందరికీ ఇలాంటి ఆహారాలు ఇష్టం కాబట్టి ఇవన్నీ ఎనామిల్ ని పాడుచేస్తాయి వీటితో పాటుగా మరొక కారణం కూడా ఉంది. వైట్ ప్రొడక్ట్స్ అంటే కార్బోహైడ్స్ హైడ్రేట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం, పంచదార పదార్థాలు బేకరీ పదార్థాలు బియ్యంతో చేసిన పదార్థాలు రవ్వతో చేసినవి ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తినేటప్పుడు ఇవన్నీ నోట్లో చెడ్డ సూక్ష్మజీవులను పెంచుతాయి. ఈ చెడ్డ సూక్ష్మజీవులు విడుదల చేస్తే వేస్టేజ్ అనేది ఎనామిల్ ని పాడుచేసి పంటి పై గారలాగా ఏర్పడుతుంది. చాలామంది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఎల్లో రావడానికి ఇది ఒక రీసన్. ఇవన్నీ పళ్ళు పచ్చగా ఉండడానికి దంతాలు ఆశించినట్టుగా మెరవకుండా ముత్యాల లాగా ఉండకపోవడానికి కారణాలు ఇవి.

మన ఆహారపు అలవాట్ల వల్ల దంతపు యొక్క రంగును మార్చుకోవచ్చా అంటే, మంచి ఆహారం తీసుకుంటే దంతాలు తెల్లగా ఉంటాయి, మంచి ఆహారాలు అంటే కూరగాయలు, పళ్ళు అలాంటివి. ఇందులో ఉండే పీచు పదార్థాలు అందులో ఉండే నాచురల్ క్లీనింగ్ ఏజెంట్స్ దంతాలపై ఉండే సూక్ష్మజీవులను శుభ్రంగా కడిగేస్తాయి, ఇలా చేయడం వల్ల గార పట్టకుండా ఉంటాయి, ఇందులో ఉండే పదార్థాలు ఏవి కూడా ఎనామిల్ ని ఇరిటేట్ చేయవు కాబట్టి ఒరిజినల్ ఎనామిల్ అనేది తెల్లగా ఉంటుంది. ఇప్పటివరకు తెలిసో తెలియకో కాస్త పైన ఎనామిల్ దెబ్బతింటే ఇకనుండి దెబ్బతినకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే దంతాలు కాస్త హెల్తీగా ఉండడానికి గార పట్టికదంతా పసుపు వర్ణంతో వాష్ అవుట్ అవుతుంది.

పండ్లు, కూరగాయలు, విత్తనాలు ఎక్కువగా తినడం, చెరుకు ముక్కలు లాంటిది దానిమ్మ గింజలు నమలడం, కమల తొనలు బత్తాయి తొనలు నమిలి తింటూ ఉంటే ఇవి చక్కగా దంతాలను క్లీన్ చేస్తాయి. ఇలాంటి డైట్ చేస్తూ ఉంటే మీ పళ్ళు తెల్లగా ఉంటాయి దంత సంరక్షణ బావుంటుంది నోరు దుర్వాసన ఉండదు, పళ్ళు పుచ్చడం కానీ దంతాలను గట్టిగా పట్టుకుని ఉండే చిగుళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా భలే హెల్ప్ చేస్తాయి. చాలామంది దంతాలను ఇలా అడ్డంగా బ్రష్ చేస్తూ ఉంటారు, కానీ మన దంతాల వరుస అనేది పైనుండి కిందకు ఉంటుంది కాబట్టి మనం పైకి క్రిందికి బ్రష్ చేయడం వల్ల ఆ పళ్ళ మధ్యలో ఏమైనా సూక్ష్మజీవులు ఉంటే అవి తొలగిపోతాయి.

అలాగే బ్రష్ ను కూడా తరచుగా మారుస్తూ ఉండాలి, పేస్టు ఎక్కువగా వాడినట్లయితే ఎక్కువగా మౌత్ వాష్ లాంటివి వాడుతున్నట్లయితే ఈ కెమికల్ ఎఫెక్ట్ కూడా ఎనామిల్ పై పడుతుంది. అందుచేత మీరు సాధ్యమైనంతవరకు ఒక పూట బ్రష్ చేసుకోండి ఒకవేళ చేయాల్సిన అవసరం ఉంటే మామూలుగా పేస్టు లేకుండా బ్రష్ చేసుకోండి. వేప పూలను కూడా దొరికినప్పుడల్లా వాడుతూ ఉండండి, వారానికి రెండు మూడుసార్లు వాడుతుందండి, ఇలా వేప పుల్ల నోట్లో వేసి నమలడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా నిర్మూలించబడుతుంది.