ముప్పై రోజుల్లో ఎంతటి నడుం ,తొడ ,పొట్ట చుట్టూ పెరిగిన కొవ్వు మంచులా కరిగిపోతుందిలా .

అధిక బరువు సమస్య వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి వీటి నుంచి బయట పడడానికి బరువు తగ్గించుకోవడం ఒకటే మార్గం కానీ బరువు తగ్గేందుకు మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా అవసరమే కొన్ని ఆయుర్వేద చిట్కాలు బరువు తగ్గించడంలో మరింత తొందరగా ఫలితాలు కలిగించేందుకు సహాయపడతాయి . దాని కోసం మనం తీసుకోవలసిన పదార్దాలు నాలుగు అవేంటో చిట్కా ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం .

దానికోసం మొదట మనం తీసుకోవలసింది అవిసగింజలు:-

అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది .ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని మీరు తిన్నపుడు కడుపు ఎక్కువ సేపు నిండినట్లు మీకు అనిపిస్తుంది .మీకు అస్తమానం తినాలనే మీ కోరికను అణచివేయడానికి ఇది సహాయపడుతుంది .

Flax Seeds Roasted & Salted 1 kg ALSI : Amazon.in: Grocery & Gourmet Foods

తర్వాత పదార్థం వాము :-

వాము విత్తనాలు పోషకాల శోషణకు చాలా బాగా సహాయపడతాయి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి .ఇది చివరికి శరీరంలో తక్కువ కొవ్వు నిల్వకు దారితీస్తుంది ,ఇది బరువు తగ్గడానికి మరింత తొందరగా దారితీస్తుంది ఆహారం బాగా జీర్ణం కానప్పుడు ,ఇది వ్యర్దాలు మరియు విషాన్ని నిల్వ ఉంచడానికి దారితీస్తుంది .ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది మరియు కేలరీలను బర్న్ చేయడం మీకు కష్టతరం చేస్తుంది .అందుకే వామును ఆహారంలో తరచూ భాగం చేసుకోవడం మంచిది .

మూడవ పదార్థం సోంపు గింజలు :-

సోంపు ఫైబర్ యొక్క గొప్ప మూలం ,ఇది ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉండటానికి మీకు సహాయపడుతుంది ,చిరుతిళ్ళ కోరికలు మరియు అతిగా తినడం నుండి మిమ్మల్ని మరింత నిరోధిస్తుంది .ఇది తక్కువ కేలరీల వినియోగానికి దారితీస్తుంది ఫలితంగా త్వరగా బరువు తగ్గుతుంది సోంపు తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్’మరియు ఖనిజ శోషణను మెరుగుపరచడం ద్వారా కొవ్వు నిల్వలను తగ్గించవచ్చు .

Neotea Fennel Seed | moti saunf | dodda sompu , 200g : Amazon.in: Grocery &  Gourmet Foods

చివరి పదార్థం నల్ల జీలకర్ర :-

ఇది చూడడానికి పొడవుగా జీలకర్ర లానే ఉంటుంది .కలోంజీని నల్ల జీలకర్ర అని పొరపాటు పడుతుంటారు .కానీ కాదు .ఇది మీ జీవక్రియను పెంచుతుంది కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు మీ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది .నల్ల జీలకర్ర తీసుకోవడం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న కొంతమందికి సహాయపడుతుందని అధ్యయనాలు కూడా నిర్దారించాయి .

నల్లజీలకర్ర అద్భుతాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు Black cumin seeds  benefits - YouTube

తయారీ -వాడకం :-

ఇప్పుడు ఈ పదార్దాలు అన్నింటిని రెండు స్పూన్ల మొత్తంలో తీసుకొని వేయించాలి .ఇవి వేగాయని తెలియడానికి మంచి వాసన వస్తుంది . తర్వాత వీటిని మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి .ఈ పొడిని ఉదయం ,సాయంత్రం గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి,ఒక స్పూన్ తేనె కలిపి ఏమైనా తినడానికి గంట ముందే తాగాలి .దీనిని గర్భిణులు ,పిల్లలు పాలిచ్చే తల్లులు తప్ప అందరూ తాగవచ్చు .గుండె జబ్బులు ఉన్నవారు ,కిడ్నీ సమస్యలు ఉన్నవారు ,రక్తపోటు ,డయాబెటిస్ ఉన్నవారు కూడా తాగవచ్చు .డయాబెటిస్ ఉన్నవారు తేనె కలపకుండా తాగడం మంచిది .