ఆ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఖచ్చితంగా చూడండి.

ప్రకృతి లో దొరికే అమూల్యమైన ఔషదం లో ఇంగువ ఒకటి అని చెప్పవచ్చు. ఇంగువ ను భారత దేశ ప్రజలు అనాది కాలం నుండే వాడుతున్నారు. ఇక ఈ ఇంగువ కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది గా పనిచేస్తుంది..ఇంగువ ప్రేగుల్లో వచ్చే నొప్పిని కూడా అది తగ్గిస్తుంది. అలాగే ఇంగువను నరాల బలానికి కూడా వాడుతారు. ఇంగువ జీర్ణవ్యవస్థ ను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది..

ఇంగువలో నిద్రని పుట్టించే గుణం కూడా ఉంది మరియు దీనిని బ్రాంకయిటస్, అస్త్మా లలో లాంటి జబ్బులలో చికిత్స కోసం వాడుకోవచ్చు. అయితే రెండు చెంచాల తేనెను 2,3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశవ్యాధులు తగ్గించుకోవచ్చు.ఇంగువ వాసనని చూపించడం వలన హిస్టీరియాతో బాధపడే వారికి ఫలితం బాగుంటుంది. ఇక ఇంగువ ఆరోగ్య పరంగా ఎన్నో విలువలను కలిగి ఉంది. అయితే ఇంగువ ను లైంగిక పటుత్వం తగ్గినవారిలో పటుత్వాన్ని పెంచుతుంది.. ఇంగువను మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి 40 రోజుల పాటు తీసుకోవడం.

వలన ఆ పటుత్వం పెంచడంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇంగువని స్త్రీల సమస్యలకి కూడా వాడుకోవచ్చు. అయితే స్త్రీ లలో వచ్చే నెలసరి నొప్పి, అధిక రక్తస్రావం, లుకేరియా, తరచూ ఎబార్షన్స్ కావడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలతోబాధపడే స్త్రీలు ఇంగువని తేనెని మేకపాలతో నెలరోజుల పాటు రోజూ మూడు సార్లు కలిపి తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. ఇంగువ ఇలా తీసుకోవడం వలన స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అనేక సమస్యలనుండి బయటపడేలా చేస్తుంది..