స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు!

మన సంప్రదాయంలో ముఖ్యంగా నమస్కారం చెప్పుకోవాలి.  పెద్దవాళ్లు, గొప్పవారు, అపరిచితులు ఇలా ఎవరు మనకు తారసపడిన వారిని పలకరించేందుకు ముందుగా చెబుతూ చేసే సంజ్ఞ నమస్కారు. రెండు చేతులు జోడించి సవినియంగా పలకరిస్తూ ఎదుటివారి ఆదరణ చూరగొంటారు. హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. 

ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి  పురుషులు చేయవచ్చు.  మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది.

ఇలా చేయ్యటం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి దర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.  ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించివచ్చు.   శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి   పాటించడం వల్ల స్త్రీల ఆరోగ్యానికి మేలు జరగుతుంది. స్త్రీలు  నమస్కరించుకోవాలనుకొన్నప్పుడు ‘పంచాగ నమస్కారాన్ని ‘అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే తాకేలా నమస్కరించుకోవడం మంచిది.