జ్ఞాపక శక్తిని పెంచే పొడి .. తింటే మతిమరుపు అసలే రాదు ..!!

Health Tips : మన మెదడు కణాల ఆయుర్దాయం 150 సంవత్సరాలు. తల్లి గర్భంలో ఉండగా మెదడు కణ నిర్మాణం ప్రారంభమవుతుంది. మొదటి రెండు సంవత్సరాల వయసు లోపే బిడ్డకు బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. అందుకనే చంటి పిల్లలకు శరీరం సన్నగా ఉన్నా, తలకాయ పెద్దగా ఉంటుంది. అంటే ఈ బాడీని నడిపించే మెదడు పూర్తిగా తయారవుతుంది అన్నమాట. ఒక్కసారి మెదడు కణాలు చనిపోతే తిరిగి పుట్టడం ఉండదు. అందుకే మెదడు కణాలు డామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. మెదడు కణాలను డ్యామేజ్ చేయడానికి వాటిని వీక్ చేయడానికి కారణం .

అయ్యే కొన్ని రకాల హానికర ప్రోటీన్స్ లోపల రిలీజ్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అవే టార్ మరియు బీటా ఏమలిట్స్ అనే ప్రోటీన్స్. ఈ ప్రోటిన్స్ బ్రెయిన్ సేల్స్ ని డామేజ్ చేస్తూ ఉంటాయి. అయితే బ్రెయిన్ సేల్స్ ని డామేజ్ చేయకుండా మిరియాలు బాగా సహాయపడతాయి. ఈ మిరియాలు బ్రెయిన్ సెల్స్ ని నాశనం చేసే ప్రోటీన్స్ ను నాశనం చేస్తాయి. బ్రెయిన్ సెల్స్ ని రక్షించడంలో మిరియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి బ్రెయిన్ సెల్స్ నశించకుండా, పెద్ద వయసు వచ్చేకొద్దీ మతిమరుపు రాకుండా మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి.

దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి మిరియాల పొడి ఉపశమనం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా బ్రెయిన్ సెల్స్ ని కాపాడుతాయి. మతిమరుపు ఆల్జీమర్స్, డిమన్షియా రాకుండా మిరియాల పొడి సహాయపడుతుంది. మనం తినే ఆహారాలలో కారానికి బదులుగా మిరియాల పొడిని వేసుకొని తింటే మంచిది. సలాడ్స్ లలో కూడా ఈ పొడిని చల్లుకొని తింటే చాలా మంచిది. కేవలం దగ్గు కఫం వంటి సమస్యలను తొలగించడమే కాదు మెదడు కణాలను రక్షించడానికి మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మిరియాలను ఆయా రూపాల్లో తినే ఆహారంలో తీసుకోగలిగితే మెదడు కణాలు చనిపోకుండా సురక్షితంగా ఉంటాయి.